కైకలూరు: ఉరి వేసుకుని వేద విద్యార్థి మృతి

ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం గ్రామానికి చెందిన కుందుర్తి సాయి శివసూరజ్ (18) పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ వద్ద ఉన్న టీటీడీ వేద పాఠశాలలో శ్రీ వేదం 4వ సంవత్సరం చదివేవాడు. బుధవారం రాత్రి సూరజ్ ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ ఉండగా గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా సూరజ్ మానసిక పరిస్థితి సరిగా లేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్