రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి

కృష్ణా జిల్లా గన్నవరం కొత్త బైపాస్ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కైకలూరు మండలం పెంచికలమర్రుకు చెందిన భువనైక నాగదుర్గ(25) మరియు ఆమె కుమారుడు కారుణ్య నాగసాయి(4) మృతి చెందారు. విజయవాడ నుంచి ఏలూరు వెళ్తున్న వీరి కారును వెనుక నుంచి రెండు గూడ్స్ లారీలు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మృతురాలి భర్త జయమంగళ విజయ్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్