ముదినేపల్లి మండలం పెయ్యేరు కాలనీ వద్ద మార్చి 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జువ్వనపూడి షడ్రక్(42) మంగళవారం విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అత్తగారింటికి వెళ్లి వస్తుండగా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు పామర్రు మండలం రిమ్మనపూడికి చెందిన వ్యక్తి. భార్య అరుణ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ పి. వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.