రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

కూటి కోసం ఏలూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా గుడివాడకు వచ్చిన జంగం తంబియ్య (49) అనే వ్యక్తి లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మండవల్లి మండలం గన్నవరం గ్రామానికి చెందిన తంబియ్య, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి 3 నెలల క్రితం గుడివాడ వచ్చి, బేతవోలు నిమ్మతోటలో ఒక చిన్న చిల్లర దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శుక్రవారం సైకిల్‌పై గుడివాడ - పామర్రు రోడ్డులోని కోతి బొమ్మ సెంటరులో ఉన్న చర్చికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొని అతనిపై నుంచి వెళ్లడంతో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్