ఎమ్మెల్యే చేతుల మీదుగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

కైకలూరు మండలం వరహాపట్నం, సీతనపల్లి PHC, ఆటపాక పంచాయితీ జాన్ పేటలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశాన్ని పోలియో రహితంగా మార్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్