వీఆర్ఓ పై కుటుంబీకులతో కలిసి టీడీపీ నేత దాడి

ఏలూరు జిల్లా మండవల్లి మండలం పులపర్రు గ్రామంలో అక్రమ లేఅవుట్ ను అడ్డుకున్న వీఆర్ఓ వెంకటేష్ పై టీడీపీ నేత ముంగర ఏడుకొండలు, అతని కుటుంబం దాడికి పాల్పడింది. మోటూరు కాలువ మార్జిన్ ను పూడ్చి లేఅవుట్ వేస్తున్నారని ఎమ్మార్వో ఆదేశాలతో అక్కడికి వెళ్లి వీఆర్ఓ అడ్డుకోవడంతో ఈ ఘటన జరిగింది.  విధులను ఆటంకపరిచి వీఆర్ఓను ఎప్పటికైనా చంపేస్తామని బెదరించిరని అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వెంకటేష్ కైకలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్