ఎన్టిఆర్ జిల్లా జి. కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన మైలవరపు సతీష్ కుమార్ పీహెచ్డీ నిమిత్తం బెల్జియంకు వెళ్లాడు. అక్కడకు ఫిలిపెయిన్స్ నుంచి ఎమ్మెస్సీ చదవటానికి డోనా క్యునో వచ్చింది. వీరి ఇద్దరి పరిచయం సేహ్నంగా మారింది. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు సాగిన వీరి ప్రేమ పెద్దల అంగీకరంతో ది. 04-07-2024న మైలవరం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో హిందూ సాంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా వారిరువురు వివాహం చేసుకున్నారు.