నరసాపురం మండలం వేములదీవి గ్రామంలో సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా 1 నుండి 19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. తూర్పు తాళ్ళు డాక్టర్ చిరంజీవి, డాక్టర్ అనిల్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీహెచ్సీ పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.