తల్లిపాల ద్వారా బిడ్డలకు లభించే పోషక విలువలు ఆరోగ్యంపై అంగన్వాడీ సిబ్బంది గర్భవతులకు అవగాహన కల్పించి పిల్లలకు తల్లిపాలు అందజేసేలా చూడాలని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఉన్నారు. గురువారం మొగల్తూరు గొల్లగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్టు నందు ఏర్పాటుచేసిన తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పొత్తూరి రామరాజు తదితరులు ఉన్నారు.