మొగల్తూరు మండలం నల్లంవారితోట వద్ద మినీ వ్యాన్ బుధవారం అదుపుతప్పి పంట బోదెలో పడటంతో పనులు చేస్తున్న ఇద్దరు ఉపాధి కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నక్కావారి పాలెంకు చెందిన ఉపాధి హమీ పని చేస్తున్న కార్మికులు కడలి పావని(45), గుబ్బల గంగాదేవి (48) మృతి చెందారు. బుధవారం రాత్రి గంగాదేవి భర్త మాణిక్యాల రావు (52) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.