మొగల్తూరు మండలం నల్లంవారితోట వద్ద బుధవారం మినీ వ్యాన్ అదుపుతప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పొలంలో పనులు చేస్తున్న ఇద్దరు ఉపాధి కార్మికులు మృతి చెందారు. మరి కొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వ్యానును బయటకు తీసే చర్యలు చేపట్టారు.