మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామ సర్పంచ్ కొప్పనాతి పల్లయ్య (64) గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. పల్లయ్య ముత్యాలపల్లి గ్రామంలో రెండో పర్యాయం సర్పంచ్ గా ఎన్నికయ్యారు. గతంలో బండి ముత్యాలమ్మ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, నీటి సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పల్లయ్య మరణంతో ముత్యాలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.