సాక్షి మీడియా అమరావతి మహిళలను అవమానించేలా మాట్లాడిందని, వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం నరసాపురంలో నిరసన ర్యాలీ జరిగింది. శివాలయం సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన సాక్షి మీడియా మహిళలకు క్షమాపణలు చెప్పాలని కోరారు.