సముద్రంలో చేపల వేటపై ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా మత్స్యశాఖ జిల్లా అధికారి ఆర్వీఎస్వీ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వేట నిషేధ సమయంలో ప్రభుత్వం వారికి జీవన భృతి కల్పిస్తుందని అన్నారు.