ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ క్రైమ్ వలలో చిక్కుకుని నరసాపురానికి చెందిన యువకుడు రూ. 54 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు. 2024 డిసెంబర్ 12న పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపక్ కుమార్ లుహరుకా, రాజేశ్ ఝుంఝున్వాలా స్టాక్ మార్కెట్ పేరుతో మోసం చేసి రూ. 54 లక్షలు కాజేశారు. ఇన్‌స్పెక్టర్ యాదగిరి కేసు నమోదు చేసి గురువారం నిందితులను అదుపులో తీసుకున్నారు.