పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం స్వరాజ్యరామం శ్రీ షిరిడి సాయి మందిరంలో మంగళవారం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామికి అర్చకులు సాయి కార్తిక్ ఆధ్వర్యంలో భక్తులు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కస్తూరి శ్రీనివాస్, బొర్రా సాయి ప్రసాద్, పెరుమాళ్ళ నాగరాజు వంటి భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.