పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవి గ్రామంలోని శ్రీ భూ సమేత వైభవ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం సుప్రభాత సేవ అనంతరం ప్రత్యేక అభిషేక పూజలు, పుష్పాలంకరణ జరిగాయి. మధ్యాహ్నం 12 గంటలకు ముత్యాలపల్లి వాస్తవ్యులు మారెళ్ళ ఆదినారాయణ, రామసీత కుటుంబ సభ్యుల సౌజన్యంతో అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.