పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో శ్రీ వంగవీటి మోహన రంగా 79వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జక్కం బాబ్జి, వంగవీటి రాధా సతీమణి పుష్పవల్లి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, సురేష్ కుమార్, గణేశ్వరరావు, బాబురావు, సత్య శ్రీ, మైసేను, శ్రీ రంగనాయకులు, నాగరాజు, గ్రామ యువత, రాధా రంగా మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు.