రాజ్ పాల్ ను పరామర్శించిన తెన్నేటి సురేష్

అనారోగ్యంతో నర్సాపురం క్రిస్టియన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎంఎస్పీ నాయకుడు కొండేటి రాజ్ పాల్ ను మాదిగ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు తెన్నేటి సురేష్ మాదిగ సోమవారం పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రాజ్ పాల్ కు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని సురేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా కార్యదర్శి సిరా రాధాకృష్ణ, నరసాపురం మండల అధ్యక్షుడు చెట్టుం శ్రీధర్ కూడా రాజ్ పాల్ ను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్

✕
✕