పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా, శ్రీ చత్రపతి శివాజీ శౌర్య యాత్రలో భాగంగా, ఆర్ఎస్ఎస్ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో చిన్నఅమిరం గ్రామం నుండి విస్సాకోడేరు రాజుల పేట రామాలయం వరకు సుమారు వెయ్యి మందితో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించబడింది. యువతీ యువకులు ఈ ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.