నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామం ప్రగతి నగర్ కు చెందిన టంకాని లక్ష్మీకుమారి (20) శనివారం ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పక్క గదిలో నిద్రిస్తున్న లక్ష్మీ కుమారి చెల్లెలు దుర్గా భవాని విషయాన్ని కుటుంబ సభ్యులకు, స్థానికులకు తెలియజేసింది. దీంతో లక్ష్మీకుమారిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.