పేరుపాలెం బీచ్‌లో యువకుడు మృతి చెందాడు. సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి యడ్ల చిట్టిబాబు కుమారుడు యడ్ల మధుబాబు (23) డిగ్రీ పూర్తిచేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. సోమవారం తన స్నేహితులతో కలిసి పేరుపాలెం బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు లోపలికి కొట్టుకువెళ్లి గల్లంతయ్యాడు. అనంతరం మృతదేహం లభ్యమయింది.