మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో సీఎం చంద్రబాబు శుక్రవారం పర్యటించారు. బీసీ వర్గానికి చెందిన బత్తుల జగన్నాథం క్షౌరశాలకు వెళ్లి ఆయన ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వృత్తికి అవసరమైన కొన్ని అధునాతన పనిముట్లను జగన్నాథంకి అందజేసారు. వారి ఇంటి నిర్మాణానికి, కొత్త సెలూన్ నిర్మాణానికి ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు