నూజివీడు బస్టాండ్ లో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఒక వ్యక్తి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. సోమవారం ఆర్టీసీ బస్టాండ్ లో అధికారులు ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెట్ల కొమ్మలను నరుకుతున్నారు. విషయం తెలియని ప్రయాణికుడు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బెంచి బల్లపై కూర్చుని ఉండగా అతని తలపై చెట్టుకొమ్మ పడడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడు. అధికారులు కానీ ఆర్టీసీ డిఎం కానీ స్పందించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్పందించిన అధికారులు గాయపడిన ప్రయాణికుడిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.