నూజివీడు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం మద్యం బాబులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ గ్యారేజీ వైపు మద్యం సీసాలు పడి ఉన్నా అధికారులు స్పందించకపోవడంపై మహిళా ప్రయాణికులు విస్మయం చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, సీసాలను తొలగించి, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.