గురువారం చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 21,000 నగదు, 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జూద క్రీడలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.