ముసునూరు మండలం చింతల వల్లి గ్రామం దళితవాడలో 25 రోజులుగా తాగునీటి ఎద్దడితో సతమతమవుతున్నారు. వేసవి కాలం కావడంతో అన్ని వర్గాల ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. గ్రామ సర్పంచ్ కి, సెక్రెటరీ మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని మహిళలు ఆదివారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన క్షేత్రస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు.