ఆదివారం ఉదయం చింతలపూడి మండలం గురుబట్లగూడెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు కంభంపాటి రాములమ్మ నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ కె. పాపారావు వారి నివాసానికి వెళ్లి, భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.