ఏలూరు: రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

బుధవారం నూజివీడు-తేలప్రోలు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని యువకుడు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడు చామనఛాయ రంగు, గుండ్రటి ముఖం, బ్లూ టీషర్ట్, సిమెంట్‌ కలర్ జీన్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడని, ఛాతిపై 'అమ్మ' అని పచ్చబొట్టు ఉందని రైల్వే ఎస్సై కృపాదానం తెలిపారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్