జి.కొండూరు: పోస్ట్ ఆఫీస్ లో రూ. 50 లక్షలు గోల్ మాల్

జి.కొండూరు మండలం సున్నంపాడు గ్రామ పోస్టాఫీసులో డబ్బు గోల్ మాల్ అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ పోస్టల్ శాఖలో పని చేస్తున్న క్రమంలో తన ఖాతాలో డిపాజిట్ చేసిన డబ్బులు లేకపోవడం గమనించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. గురువారం అధికారులు విచారణలో రూ.22 లక్షల వరకు మాయమైనట్టు మొత్తం రూ.50 లక్షలకు పైగా పోస్టుమాస్టర్ విత్‌డ్రా చేసినట్టు తెలిసింది. డిపాజిటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శుక్ర, శనివారంలో అధికారులు వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్