ప్రేమ వివాహం.. రమణక్కపేటలో యువకుడిని స్తంభానికి కట్టేసి చితకబాది!

ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. బాధితుడు మండవల్లి మండలం కారుకొల్లుకు చెందిన సాయిచంద్, గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమణక్కపేట గ్రామంలో పోస్ట్ ఉమెన్‌గా పనిచేస్తున్న సాయి దుర్గతో 8 ఏళ్లుగా ప్రేమించుకున్నామని, వివాహం చేసుకున్న తన భార్యను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్