చాట్రాయి మండలం జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు ఆర్టీసీ శాఖ వారు విజయవాడ నుంచి విస్సన్నపేట వరకు నడుపుతున్న మెట్రో బస్సులను చాట్రాయి గ్రామాల ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రమైన చాట్రాయి వరకు నడపలని కోరుతూ శుక్రవారం ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారు 308 మెట్రో బస్సులను విస్సన్నపేట వరకు నడుపుతున్న బస్సులను చాట్రాయి వరకు పొడిగించాలని కోరారు.