ఏలూరు జిల్లా ముసునూరులోని లోపూడిలో సోమవారం ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి, ఎడ్ల బండిపై విచ్చేసి గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, మంత్రి స్వయంగా నాగలి పట్టి రైతుల సాగు భూమిలో దుక్కి దున్ని, వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, స్థానిక రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.