ముసునూరు: అంతర్రాష్ట్ర నేరస్తుడు అరెస్ట్

ముసునూరు పోలీసులు బుధవారం అంతర్రాష్ట్ర నేరస్తుడు యుగందర్ ను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన నిందితుడు, 20 ఏళ్ల నేర చరిత్ర కలిగి ఉన్నాడు. ఒంటరిగా ఉన్న వృద్ధులను 'ఇల్లు అద్దెకు కావాలి' అని నమ్మించి ఇంట్లోకి ప్రవేశించి, వారికి మత్తు ఇచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్