ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన వాసం రాజాబాబు, ఆగిరిపల్లికి చెందిన జ్యోతిరాశికి 2024లో వివాహమైంది. అదనపు కట్నం తీసుకురావాలని భర్త రాజాబాబు, అత్త మార్తమ్మ జ్యోతిరాశిని శారీరకంగా, మానసికంగా వేధించారు. గత నెల 27న దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఆసుపత్రి నుంచి సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం. చిరంజీవి తెలిపారు.