నూజివీడులో మందుబాబులకు పోలీసులు కౌన్సిలింగ్

నూజివీడు పట్టణంలో బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న మందుబాబులకు ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవిస్తే చట్ట రీత్యా నేరమని నూజివీడు టౌన్ సిఐ సత్య శ్రీనివాస్ హెచ్చరించారు. బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న ఆరుగురిని పట్టణ ఎస్సై జ్యోతిబాసు పట్టుకున్నారు. మరోసారి బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్