పేకాట శిబిరంపై దాడి: పదిమంది అరెస్ట్, నగదు, వాహనాలు స్వాధీనం

ఏలూరు జిల్లా నూజివీడు మండలం ఎం.ఎన్ పాలెంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.17,390 నగదు, 9 మోటార్ సైకిళ్లు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జ్యోతి బస్ తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంగళవారం ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్