పరుగు పందెంలో పథకం సాధించిన రెండేళ్ల చిన్నారి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన రెండేళ్ల మోరంపూడి శ్రీహేయాన్ష్ చౌదరీ, విజయవాడలో జరిగిన న్యూ ఇండియా బేబీ ఒలంపిక్స్ లో పరుగు పందెంలో పథకం సాధించి పలువురి దృష్టిని ఆకర్షించారు. ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల వయసున్న పిల్లల కోసం జరిగిన ఈ పోటీలలో పాల్గొన్న హేయాన్ష్, ప్రశంస పత్రంతో పాటు పథకాన్ని గెలుచుకున్నారు. ఈ విజయంపై తల్లి శకుంతల మాట్లాడుతూ భవిష్యత్తులో తన బిడ్డను ఒలంపిక్స్ కు పంపాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్