పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వెలిగొండ ప్రాజెక్టును గతంలోనే జాతికి అంకితం చేశామని జగన్ చెప్పడం హాస్యాస్పదమని, ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఇతరుల క్రెడిట్ దొంగిలించడంలో జగన్ ను మించిన వారు లేరని ఎద్దేవా చేశారు. జగన్ ట్రాక్ రికార్డ్ అంతా అబద్ధాలు, వంచనతో కూడుకున్నదేనని మంత్రి మండిపడ్డారు.