పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వాసవి నగర్ లో శ్రీ నగరేశ్వర జనార్ధన సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం గురువారం, పూర్ణాహుతితో ముగిసింది. అనంతరం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు, పాలకొల్లు వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ పెద్దలు, సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.