బాలికల రక్షణపై పాలకొల్లులో శిక్షణా శిబిరం

పాలకొల్లు BRMV మున్సిపల్ హైస్కూల్‌లో బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్థాయి శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో చిన్నారులపై లైంగిక వేధింపుల నివారణలో విద్య, వైద్య, ICDS, మహిళా పోలీసు తదితర శాఖల పాత్రపై డా. కృష్ణారెడ్డి అవగాహన కల్పించారు. పోక్సో, జేజే చట్టాలు, చికిత్సా సేవలు, సమాజ బాధ్యతలపై అధికారులు వివరించారు. వివిధ శాఖల సమన్వయంతో బాలికల రక్షణకు కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్