పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని BRMV హైస్కూల్లో బాలికలపై లైంగిక వేధింపుల నివారణపై మండల స్థాయి శిక్షణ జరిగింది. తణుకు జిల్లా ఆసుపత్రికి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డా. కృష్ణారెడ్డి ఈ శిక్షణను అందించారు. ఈ కార్యక్రమంలో MEO RNVSG శర్మ, CDPO ఉమా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మహిళా పోలీసులు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యం చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి రక్షించడం.