వ్యక్తి దారుణ హత్య

ఏలూరు జిల్లా జీలుగుమిల్లీ మండలం దర్భగూడెం గ్రామంలో పిల్లెం వెంకయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున పొలం పనులకు వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో మెడ వెనుక భాగంలో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనకు గల కారణాలను, బాధ్యులను గుర్తించేందుకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕