ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ గురువారం బుట్టాయగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మాట్లాడుతూ, గ్రేడ్ వర్జీనియా పొగాకు కిలోకు రూ. 300 ధర కల్పించాలని, పత్తి, మొక్కజొన్న, వరి, బొబ్బర, జీడిమామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లో గ్రేడ్ పొగాకు కిలోకు రూ. 100 లోపు ధర ఇవ్వడం వలన పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.