ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ఆదివారం రెడ్డిగణవరం ఫారెస్ట్ బిల్డింగ్ సమీపంలోని గోతిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.