పోలవరం నియోజకవర్గం, టి నరసాపురం మండలం తెడ్లం గ్రామంలో వికసిత్ భారత్ - జి రామ్ జి కార్యక్రమాన్ని కూటమి నాయకులు గురువారం ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను కేతిరెడ్డి వీరారెడ్డి పరిశీలించారు. కార్మికులతో కలిసి పారపట్టి, తట్టలో మట్టినింపుతూ వారికి ప్రోత్సాహం అందించారు. గ్రామీణాభివృద్ధే దేశాభివృద్ధికి పునాది అని, పేద కుటుంబాలకు ఉపాధి కల్పించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ జి స్టిఫెన్, కె వీరారెడ్డి, ఎంఆర్డీ ప్రసాద్ రెడ్డి, రామస్వామి, వై భానుప్రసాద్, బి మోహన్, బి నాగేశ్వరావు, టి సురేష్, పి కొండయ్య పాల్గొన్నారు.