శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రాజెక్టు అమలుపై అధికారుల నుండి వివరణాత్మక సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయ స్వప్నమని, రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, పనులు వేగంగా, నాణ్యతతో సాగుతున్నాయని తెలిపారు.