టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అభిమానులు, కూటమి నాయకుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు ఎం.ఆర్.డి. ప్రసాద్, దించినాల బ్రమ్మం, రాచప్రోలు నవీన్, బండారు నాగేశ్వరావు, తోట సురేష్, తోట శరన్, టీడీపీ మండల ట్రెజరర్ బండి శ్రీనివాస్, యలమర్తి భానుప్రసాద్, నాగదేశీ శౌరి, వీరంకి సత్యనారాయణ, పిన్నిబోయిన కొండయ్య, కాలసాని దుర్గయ్య, గంజి స్టీపెన్ తో పాటు గ్రామ ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.