పోలవరం: 400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో సారా తయారీ కేంద్రం‌పై శుక్రవారం దాడులు చేసినట్లు  ఎక్సైజ్ సీఐ ఎ. మస్తానయ్య తెలిపారు. ఈ దాడుల్లో సారా తయారీకి వినియోగించే పులిసిన 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు చెప్పారు. సారా తయారీ, క్రయవిక్రయాలు, అక్రమ మద్యం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సారా సమాచారం ఉంటే 9440902462 నంబర్ కు తెలియజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్