పోలవరం: ద్విచక్రవాహనాల ఢీ..ఇద్దరికి గాయాలు

పోలవరం మండలం వెంకటాపురం సమీపంలో గురువారం రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన జరిగింది. ప్రగడపల్లి వైపు నుంచి పోలవరం దిశగా వెళ్తున్న బైక్‌ను ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలను నడుపుతున్న వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఘటనను గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్